![]() |
![]() |

ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసిన 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' షో ఎట్టకేలకు దీపావళి పర్వదినం సందర్భంగా నవంబర్ 4న ఆహాలో స్ట్రీమింగ్ మొదలైంది. ఇప్పటికే ఈ షో ప్రోమోస్ వీక్షకుల్లో క్యూరియాసిటీని బాగా పెంచాయి. ఫస్ట్ ఎపిసోడ్‌లో డైలాగ్ కింగ్ మోహన్‌బాబును ఆయన ఇంటర్వ్యూ చేసిన తీరు శాంపిల్‌గా మనకు చూపించారు. తనదైన స్టైల్‌లో బాలయ్య వేసిన ప్రశ్నలు, పంచ్‌లు ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఎప్పుడెప్పుడు ఫుల్ ఎపిసోడ్ చూద్దామా అని వారు అత్యంత ఆసక్తిగా ఎదురుచూశారు.
ఇప్పటిదాకా మనం చూడని బాలయ్యలోని మరో కోణాన్ని అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే చూపించిందనే అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవుతోంది. ఆరు పదుల వయసును అందుకున్న బాలయ్య ముఖంలో ఆ వయసు లక్షణాలు కనిపిస్తున్నా, ఆయన మూమెంట్స్‌లో మాత్రం అదేమీ కనిపించలేదు. ఎంతో ఎనర్జిటిక్‌గా ఆయన కనిపించారు. మోహన్‌బాబుతో ఆయన సంభాషణ జరిపిన విధానం అలరించింది. మధ్య మధ్యలో తన చేష్టలు, మాటలతో ఆయన వినోదాన్ని పంచారు. దీపావళి క్రాకర్స్‌లా ఈ ఎపిసోడ్ అలరించింది.
ఈ సందర్భంలోనే తన తాగుడు అలవాటు గురించి మోహన్‌బాబు మనసువిప్పి మాట్లాడారు. కెరీర్ తొలినాళ్లలో తన దగ్గర డబ్బులు ఉండేవి కావనీ, కోడంబాకం బ్రిడ్జి కింద సారాయి షాపుకు ఓ స్నేహితుడిలో వెళ్లి సారాయి తాగేవాడినని మోహన్‌బాబు వెల్లడించారు. తన దగ్గర డబ్బులు లేని రోజుల్లో సారాయి తాగాననీ, ఇప్పుడు దేవుడు డబ్బిచ్చాడు కాబట్టి విస్కీ తాగుతున్నాననీ ఆయన చెప్పారు.
అలాగే మంచు లక్ష్మితో బాలయ్య చేసిన డాన్సులు, విష్ణుతో ఆయన మాట్లాడిన విధానం కూడా ఆకట్టుకుందని అభిమానులు అంటున్నారు. రానున్న ఎపిసోడ్లలో టాలీవుడ్‌లోని పలువురు టాప్ స్టార్స్‌ను బాలయ్య ఇంటర్వ్యూ చేయడం మనం చూడనున్నాం. వారిలో ప్రభాస్ కూడా ఒకరు.
![]() |
![]() |